“లవ్ స్టోరీ” చిత్ర యూనిట్ కి ఏ ఆర్ రెహమాన్ స్పెషల్ విషెస్!

Published on Sep 19, 2021 7:37 pm IST

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెస్ చెబుతూ ఏ ఆర్ రెహమాన్ ఒక వీడియో ను విడుదల చేసారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నారు. పవన్ ఎంతో టాలెంటెడ్ అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా నాగ చైతన్య, సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల కి గుడ్ లక్ తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పతాకం పై నారాయణ్ దాస్ కే నరాంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను సెప్టెంబర్ 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :