
ఇండియన్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరుగా నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్. ఇప్పటి వరకూ తన సినిమాల్లో, ఆల్బమ్స్ లో ఎక్కువగా పాటలు పాడిన ఎ ఆర్ రెహమాన్ త్వరలోనే తన కెరీర్లో మొట్ట మొదటి సారిగా వేరే సినిమాకి పాట పాడటానికి సిద్దమయ్యాడు. అది కూడా తన కజిన్ జివి ప్రకాష్ కుమార్ 50వ సినిమాలో ఓ పాట పాడటానికి సిద్దమవుతున్నాడు. జివి ప్రకాష్ కుమార్ తన 50వ సినిమాని ఇలయథలపథి విజయ్ హీరోగా నటించనున్న సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సినిమాకి రాజా రాణి దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాలో ఓ సాంగ్ పాడడం కోసం ఎఆర్ రెహమాన్ ని అప్రోచ్ అయ్యాడు. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే సమాచారం. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడనుంది. జూన్ 26న లాంచ్ కానున్న ఈ సినిమాలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం విజయ్ పులి సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

