మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈసినిమా ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. సెప్టెంబర్ 20న ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను ఘనంగా జరుపనున్నారు. అయితే దీనిపై అధికారక ప్రకటన వెలుబడాల్సి వుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క ఆడియో ఆల్బమ్ ఫై మంచి అంచనాలు వున్నాయి.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ మొదటి సారి చిత్తూర్ యాస లో డైలాగులు చెప్పనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుండగా సునీల్ కమీడియన్ పాత్రలో నటిస్తున్నారు. హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక మొదటి సారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
