ఎన్టీఆర్ ‘అరవింద’ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Sep 15, 2018 10:59 am IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. కాగా తాజాగా ఈ చిత్రబృందం నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం నుండి ‘అనగనగా’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా హారిక హాసిని క్రియేషన్స్ తమ ట్వీటర్ అకౌంట్ ద్వారా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :