అరవింద సమేత అప్డేట్స్ !

Published on Sep 3, 2018 10:19 am IST


త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ తో పాటు డబ్బింగ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈనెల చివరి వారంలో ఈ సినిమాకు సంభందించిన అన్ని పనులను పూర్తి చేసి సినిమాను అక్టోబర్11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :