‘అరవింద’కే ఎందుకు ఇలా జరుగుతుంది !

Published on Jul 23, 2018 3:05 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈచిత్ర కథ ఇదేనంటూ సోషల్ మీడియా లో వార్తలు వెలుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు ఈ చిత్రం యొక్క కీలక సన్నివేశానికి సంభందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో అసలు ఈ ఫోటో ఎలా లీకయిందో తెలియక చిత్ర యూనిట్ తల పట్టుకుంటుంది. మరి చిత్ర షూటింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి లీకులు జరుగకుండా చూసుకుంటే మేలు.

ఇక ఈ ఫొటోలో నాగబాబు తీవ్రంగా గాయపడి ఉండగా ఎన్టీఆర్ కంగారు పడుతూ జీప్ డ్రైవ్ చేస్తున్నాడు. నాగబాబు ఈచిత్రంలో ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో ఫ్యాక్షనిస్టు గా నటిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :