‘అరవింద సమేత’ నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Sep 30, 2018 10:58 am IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తోన్న ఓ వార్త ఇపుడు ఎన్టీఆర్ అభిమానులను తెగ ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడట. ఇటు తండ్రిపాత్రలోనూ.. అలాగే అటు కొడుకు పాత్రలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తండ్రి పాత్ర సరసన నటించందని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే.. చిత్రబృందం ఈ విషయాన్ని బయటపెట్టలేదట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :