ఎన్టీఆర్ ‘అరవింద’ నుండి బిగ్ అప్ డేట్ !

ఎన్టీఆర్ ‘అరవింద’ నుండి బిగ్ అప్ డేట్ !

Published on Oct 1, 2018 6:53 PM IST

aravinda date

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. ఈ సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి, ఓ బిగ్ అప్ డేట్ తెలిసింది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల పది నిముషాలకు ‘అరవింద సమేత ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేయనున్నారు.

కాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ వారంలో పూర్తి అవుతాయట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఇటు తండ్రిపాత్రలోనూ.. అటు కొడుకు పాత్రలోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈషా రెబ్బా తండ్రి పాత్రకు జోడీగా నటించందట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా, దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు