నిరాశపరిచిన అరవింద సమేత టెలివిజన్ ప్రీమియర్ రేటింగ్స్ !

Published on Jan 24, 2019 12:53 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. గత ఏడాది దసరా సీజన్ లో విడుదలైన ఈచిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే బుల్లితెర ఫై అనుకున్నంతగా రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయింది ఈ చిత్రం. ఇటీవల జీ తెలుగు ఈచిత్రాన్ని ప్రసారం చేయగా 13.7 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టింది.

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఇప్పటికి వరుకు రెండు సార్లు ప్రసారం కాగా 20 , 17 చొప్పన రేటింగ్స్ ను రాబట్టింది. ఆలెక్కన చూసుకుంటే అరవింద సమేత నిరాశపరిచినట్లే.

ఇక ఈ చిత్రం తో పాటు ఇటీవల ప్రసారం అయినా సినిమాల రేటింగ్స్ :

అరవింద సమేత – 13.7

హలో గురు ప్రేమకోసమే – 8.7

తొలిప్రేమ (వరుణ్ తేజ్) – 6.2

పందెంకోడి 2 – 5.5

అమర్ అక్బర్ ఆంటొని- 3.2

సంబంధిత సమాచారం :

X
More