యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం ఫై ఇటు ప్రేక్షకుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు వున్నాయి. దాంతో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందట. అన్ని ఏరియాల్లో కలిపి సుమారు 100కోట్లకు ఈచిత్రం అమ్ముడైయినట్లు సమాచారం. వరుస విజయాలతో ఎన్టీఆర్ సూపర్ ఫామ్ లో ఉండడం అలాగే మొదటి సారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో ఈ సినిమా వస్తుడడంతో డిస్టిబ్యూటర్లు, నిర్మాత అడిగినంత చెల్లించారని సమాచారం.
మరి ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే 100కోట్లు రాబట్టడం ఎన్టీఆర్ కు పెద్ద విషయం కాదు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న భారీ స్థాయిలో విడుదల కానుంది.


