ఎన్టీఆర్ సినిమాలో జాతీయ ఉత్తమ నటి ?

Published on Mar 21, 2021 8:21 pm IST

‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ సీనియర్ నటి నటించబోతుంది. సీనియర్ నటి నిరీక్షణ ఫేమ్ అర్చన నటించబోతుందట. అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని పొందిన ప్రముఖ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాలకు గాను 1989 లో, 1988 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి.

కాగా చాల ఏళ్ల తర్వాత ఆమె త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో ఎన్టీఆర్ కి అమ్మ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :