‘ఉప్పెన’ కోసం పోటీ పడుతున్నాయట ?

‘ఉప్పెన’ కోసం పోటీ పడుతున్నాయట ?

Published on Dec 14, 2020 10:37 PM IST

Uppena

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ సినిమా కోసం ప్రస్తుతం డిజిటల్ యాప్స్ పోటీ పడుతున్నాయట. స్టార్ హీరో సినిమాకే పోటీ లేని ఈ రోజుల్లో వైష్ణ‌వ్‌ తేజ్ అనే కొత్త హీరో సినిమాకి ఇంత పోటీ ఏంటని అడుగుతున్నారు నెటిజన్లు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకి భారీగా ఆఫర్ చేసిందట. అలాగే ఈ సినిమా కోసం ఓటిటి నెట్ ఫ్లిఫ్స్ సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని.. ఆహా కూడా ఉప్పెన కోసం పోటీ పడుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి. హిట్ వచ్చినా రాకపోయినా ఆల్ రెడీ వైష్ణ‌వ్‌ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు