వైవిధ్యమైన వాయిస్, విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో అర్జున్ దాస్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’తో అందరినీ ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు సరికొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘సూపర్ హీరో బాబు’ (తమిళంలో ‘సూపర్ హీరో’) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కె.ఎస్. సినిష్ తన ‘సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ‘రెడాక్టెడ్ స్టూడియోస్’కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో ‘బెలూన్’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కె.ఎస్. సినిష్.. ఆ తర్వాత నిర్మాతగా మారి ‘డిక్కిలూనా’, ‘పార్కింగ్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అదే జోష్‌తో ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కంటెంట్‌తో ‘సూపర్ హీరో బాబు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమాలో అర్జున్ దాస్‌కు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ తేజు అశ్విని నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ప్రస్తుతం నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. రీసెంట్గా ‘లోక చాప్టర్ 1’, ‘కిష్కిందపురి’ చిత్రాల్లో విలక్షణ నటనతో మెప్పించిన శాండీ.. ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. స్క్రీన్ మీద శాండీ మాస్టర్, అర్జున్ దాస్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన విందు పంచనున్నాయని సమాచారం.
ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో సినిష్ దర్శకత్వం వహించిన ‘బెలూన్’ సినిమాకు విఘ్నేష్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. కార్తీక్ యోగి (డిక్కిలూనా), రామ్ (పార్కింగ్) వంటి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిష్.. ఇప్పుడు విఘ్నేష్‌ను కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి సెన్సేషనల్ ఆల్బమ్స్‌తో మ్యాజిక్ చేసిన హేషమ్.. ఈ సినిమాకు కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, దీనివల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


