హిందీ ‘అర్జున్ రెడ్డి’కి రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 21, 2019 5:32 pm IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రం హిందీ భాషలోకి కూడా గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా.. అక్కడ ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇక ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :