థియేటర్లలోకి మరోసారి “అర్జున్ రెడ్డి”.. ఈసారి అవి కూడా..!

Published on Apr 13, 2022 1:35 am IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతుందట. ఈ సారి మరిన్ని సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యిందని ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెలిపాడు. వాస్తవానికి “అర్జున్ రెడ్డి” సినిమా నిడివి ముందుగా 4 గంటల 20 నిమిషాలు వచ్చిందట. దానిని కాస్త కుదించి 3 గంటల 45 నిమిషాలు చేశారట.

అయితే చివరలో మరీ నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనని 3 గంటల 6 నిమిషాలకే కుదించి థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలై ఈ ఏడాది ఆగష్టు 25 నాటికి 5 ఏళ్లు పూర్తి కావస్తుడడంతో అదే రోజున అర్జున్ రెడ్డి సినిమాని మళ్లీ థియేటర్లలో విడుదల చేసే అలోచన ఉందన్నారు. అయితే ఈ సారి ఎలాంటి కుదింపులు లేకుండా 3 గంటల 45 నిమిషాలు కలిగిన సినిమాను విడుదల చేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో అర్జున్ రెడ్డి బాల్యం, స్కూల్ స్నేహం తదితర సన్నివేశాలు ఉండనున్నాయట.

సంబంధిత సమాచారం :