కల్లెక్షన్లలో దూసుకుపోతున్న ‘అర్జున్ రెడ్డి’


విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కుర్రకారుకు విపరీతంగా నచ్చడంతో పాటు, వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్లలో తిరుగులేకుండా దూసుకుపోతోంది. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల్లో విడుదలైన ప్రతిచోట భారీ వసూళ్లతో దూసుకుని పోతోంది.వివాదాలతో ఈ చిత్రానికి మరింత పబ్లిసిటీ ఏర్పడింది. నిన్న బాలకృష్ణ హీరోగా ‘పైసా వసూల్’ సినిమా విడుదల అయినా ‘అర్జున్ రెడ్డి’ కలెక్షన్లలో ఏమాత్రం తగ్గలేదు. అటు ఓవర్సీస్ లోను రికార్డ్ దిశగా పయనిస్తోంది.

ఆంధ్ర కృష్ణా డిస్ట్రిక్ట్ లో అయితే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా ఎనిమిదవ రోజు ఈ చిత్రం రూ. 2,36,927 షేర్ ని రాబట్టింది. ఇప్పటివరకు కృష్ణ జిల్లాలో టోటల్ గా రూ 81,45,183 షేర్ ని సాధించడం విశేషం. కేవలం కృష్ణా జిల్లాలోనే ఎనిమిది రోజుల్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది.