అర్జున్ రెడ్డి అక్కడ కూడా రీమేక్ అవుతుంది !

Published on Sep 16, 2018 3:04 pm IST


సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ఈచిత్రం ఘన విజయం సాధించి కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈసినిమాతో విజయ్ ఓవర్ నైట్లో సెన్సషనల్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఈచిత్రం తమిళ , హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషలో ‘వర్మ’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరో గా నటిస్తుండగా హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈ చిత్రం మరో దక్షిణాది బాషలోకి రీమేక్ కానుంది. తాజాగా మలయాళంలో ఈచిత్రాన్ని రీమేక్ చేయనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరో,హీరోయిన్లుగా ఎవరు నటిస్తారో తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :