అర్జున్ రెడ్డి నైజాం లెక్క ఎంతంటే !

26th, August 2017 - 01:44:43 PM


యువత నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ తో అర్జున్ రెడ్డి చిత్రం భారీ కలెక్షన్ దిశగా సాగుతోంది. యువహీరో విజయ్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. యువతకు నచ్చే కంటెంట్ ఉందన్న ప్రచారం, దీనిపై నెలకొన్న వివాదాలతో ఈ చిత్రంపై యువతలో మంచి క్యూరియాసిటీ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీమియర్స్ మరియు శుక్రవారం కలిపి 1.4 కోట్ల వసూలు చేసింది.

చిత్ర యూనిట్ చేసిన భారీ ప్రచార కార్యక్రమాలు అర్జున్ రెడ్డి చిత్రానికి బాగా కలసి వచ్చాయి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించగా అతని సోదరుడు నిర్మించారు. రాబోవు రోజుల్లో కూడా ఈ చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా కొనసాగనున్నాయి.