రియల్ హీరోలకు అర్జున్ సత్కారం.. ఘనంగా ‘సీతా పయనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

రియల్ హీరోలకు అర్జున్ సత్కారం.. ఘనంగా ‘సీతా పయనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Feb 11, 2026 11:03 AM IST

Seetha Payanam Pre-Release Event

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోని ప్రధాన విశేషమేమిటంటే.. పర్యావరణ, సామాజిక వేత్తలు డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణ వంటి నలుగురు ‘రియల్ హీరోల’ను చిత్ర యూనిట్ వేదికపై సత్కరించింది. వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించి అర్జున్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

దర్శకనిర్మాత అర్జున్ మాట్లాడుతూ.. “నా కూతురిని ఒక మంచి కథ, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిజాయితీగా తెరకెక్కించాను. ఇది బంధాల విలువలను చాటిచెప్పే సినిమా. ఇందులో సత్యరాజ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా.. నేను, ధృవ సర్జా అతిథి పాత్రల్లో కనిపిస్తాం. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రధాన బలం” అని తెలిపారు.

హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ.. ఇది తనకు కేవలం సినిమా కాదని, ఓ ఎమోషన్ అని పేర్కొన్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడైన హీరో నిరంజన్ మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

తాజా వార్తలు