అర్జున్ సురవరం రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on May 1, 2019 1:04 pm IST

యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం ఈ రోజు విడుదలకావాల్సి ఉండగా అవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలకావడంతో చివరి నిమిషంలో ఈ సినిమా ను వాయిదా వేశారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రాన్ని మే 17న థియేటర్లలోకి తీసుకురానున్నారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రాన్ని టిఎన్ సంతోష్ డైరెక్ట్ చేయగా లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది.

సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం యొక్క థియేట్రీకల్ హక్కులను ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. నిఖిల్ ఈ చిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More