అర్జున్ సురవరం మరో సారి .. !

Published on Apr 25, 2019 12:18 pm IST

అర్జున్ సురవరం సినిమా ను ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో గాని నిఖిల్ సినిమాను థియేటర్లలోకి తీసుకరాలేకపోతున్నాడు. షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఆ తరువాత టైటిల్ వివాదమైంది. దాంతో టైటిల్ ను మార్చారు. ఇక సినిమాను సోలోగా థియేటర్లలోకి తీసుకరావాలనుకున్నారు. కాని సరైన విడుదల తేదీ దొరకలేదు. దాంతో పలు సార్లు విడుదల తేది ని ప్రకటించి వాయిదావేశారు . ఇక ఎట్టకేలకు ఇటీవల మే 1 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రకటించారు. అందుకు తగ్గట్లు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశాడు నిఖిల్.

అయితే ఇప్పుడు మరో సారి విడుదలను వాయిదావేశారు. ఈనెల 26న తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకడం లేదట. దాంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఈరోజు జరగాల్సిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను కూడా రద్దు చేసుకున్నారు.

టి యెన్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :