రాజుల కాలం నుంచి ఇప్పటి వరకూ మన ప్రపంచంలో ప్రతి చోటా వారసత్వం అనేది కొనసాగుతూ వస్తోంది. ఇదే వారసత్వం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోల కొడుకులు మాత్రమే ఎక్కువగా వారసత్వాన్ని అందుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ మారి హీరోల కుమార్తెలు కూడా పలు రంగాల్లో రాణించడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు, శరత్ కుమార్, అనిల్ కపూర్ మొదలైన వారి కుమార్తెలు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి తమ టాలెంట్ తో తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
వీరి బాటలోనే యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇప్పటి వరకూ వేరే వారి డైరెక్షన్ లో కనిపించిన ఐశ్వర్య ఈ సారి అర్జున్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించనుంది. ఈ విషయంపై అర్జున్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం రెండు మూడు కథలున్నాయి. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసుకోవాలి. దానికి నిర్మాత, దర్శకుడిని నేనే కానీ ఆ సినిమాలో నేను నటించను. ఐశ్వర్య లీడ్ రోల్ చేసే ఈ సినిమా జైహింద్ 2 తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని’ తెలిపాడు.


