ఆహా వీడియో లోకి వచ్చేసిన “అర్జున ఫల్గుణ”

Published on Jan 26, 2022 9:00 am IST


శ్రీ విష్ణు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్ లుగా తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే ఈ చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈ చిత్రం ఆహా వీడియో లోకి రావడం జరిగింది. ఈరోజు నుండి ఈ చిత్రం ఆహా వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కి ఆహా వీడియో లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :