అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్ !

Published on Feb 17, 2019 10:26 am IST

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి కోలీవుడ్ లో ‘రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్న ఈచిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ‘అక్టోబర్’ ఫేమ్ భణిత సంధు హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈచిత్రానికి డైరెక్టర్ ను కుడా ఖరారు చేశారు. ఒరిజినల్ వెర్షన్ కి డైరెక్టర్ సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ఈచిత్రాన్ని రీమేక్ చేసిన అవుట్ ఫుట్ నచ్చకపోవడంతో హీరో ను తప్ప మిగతా అందరిని మార్చి మళ్ళీ ఫస్ట్ నుండి కొత్తగా తెరకెక్కించేందుకు నిర్మాతలు రెడీ అయిపోయారు. ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :