‘నోటా’లో నటిస్తున్న ప్రముఖ దర్శకుడు !
Published on Sep 12, 2018 1:58 am IST


యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ‘ఇరుముగన్ ‘ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు ఆనంద్ శంకర్, మురగదాస్ దగ్గర కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి వ్యూస్ ను రాబట్టుకుంది.

మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకం ఫై నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు సత్య రాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల విజయ్ నటించిన గీత గోవిందం తమిళనాడులో కూడా విడుదలై నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఇప్పుడు ఈ నోటా ఫై అంచనాలు పెరిగాయి. ఈచిత్రం తెలుగు,తమిళ భాషల్లో అక్టోబర్ 4న విడుదలకానుంది.

  • 12
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook