రజినీ ‘రోబో2.0’లో ఆర్నాల్డ్ లేనట్టేనా??

రజినీ ‘రోబో2.0’లో ఆర్నాల్డ్ లేనట్టేనా??

Published on Dec 16, 2015 1:04 PM IST

rajinikrand-and-arnold
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – సౌత్ ఇండియన్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న ‘రోబో 2.0’ ఈ రోజు నుంచి సెట్స్ పైకి వెళ్ళింది. భారీ బడ్జెట్ తో, ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో 3డి ఫార్మాట్ లో శంకర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. దాంతో శంకర్ మొదట్లో హాలీవుడ్ స్టార్ అయిన ఆర్నాల్డ్ ని ఈ సినిమాలో మెయిన్ విలన్ గా తీసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే చర్చలు కూడా జరిపాడు.

కానీ ఫైనల్ గా పలు కారణాల వల్ల ఆ చర్చలు విఫలం అవ్వడం వలన ఆర్నాల్డ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తమిళ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక ఆర్నాల్డ్ తప్పుకోవడంతో బాలీవుడ్ నుంచి ఓ ఫేమస్ స్టార్ ని విలన్ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో రోబో పాత్ర చేయడం కోసం అమీ జాక్సన్ ని ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శంకర్ వచ్చే ఏడాది అంతా షూటింగ్ మారాయి పోస్ట్ ప్రొడక్షన్ చేసి 2017లో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లైకా ప్రొడక్షన్ వారు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు