డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “ఆర్టికల్ 370”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “ఆర్టికల్ 370”

Published on Mar 24, 2024 8:28 PM IST

యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ లు ప్రధాన పాత్రల్లో, ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆర్టికల్ 370. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాల్గో వారం ఈ సినిమా 4.77 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ 79 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూళ్లను రాబట్టగా, 107 కోట్ల రూపాయల గ్రాస్ కి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే విధంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశం పై సినిమా తెరకెక్కింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19 వ తేదీ నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు