సాహో షూటింగ్ పూర్తి చేసిన తమిళ హీరో !

సాహో షూటింగ్ పూర్తి చేసిన తమిళ హీరో !

Published on Mar 19, 2019 8:39 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం లో తమిళ హీరో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం యొక్క మేకింగ్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో ఆగస్టు 15న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు