బోల్డ్ హీరోయిన్ పక్కన కూల్ హీరో సెట్ అవుతాడా?

బోల్డ్ హీరోయిన్ పక్కన కూల్ హీరో సెట్ అవుతాడా?

Published on Oct 28, 2019 11:26 AM IST

arvind swamy

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ (మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే బోల్డ్ హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించిన కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి కూల్ హీరో సూట్ అవుతాడా. బయోపిక్ కాబట్టి పాత్రలకు అనుగుణంగా తీసుకున్నారు అనుకున్నా.. జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కంగనా – అరవింద స్వామి మధ్య కెమిస్ట్రీ కూడా ఆ రేంజ్ లో ఎలివేట్ అవ్వాలి. మరి చూద్దాం బోల్డ్ హీరోయిన్ పక్కన కూల్ హీరో సెట్ అవుతాడో లేదో.

ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. ఇప్పుడు బరువు కూడా పెరుగుతుందని.. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.

తాజా వార్తలు