సీక్వెల్ కు సిద్ధం అవుతున్న ఆర్య.!

Published on Jun 15, 2021 8:02 am IST

సీక్వెల్, ఆర్య అంటే మన దగ్గర స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబో వచ్చిన “ఆర్య” సినిమా కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తన భార్య సాయేషా హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం సీక్వెల్ కోసం.. వీరిద్దరి కాంబోలో శక్తి రాజన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం “టెడ్డీ”.

హారర్ కమ్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగులో ఓటిటి రిలీజ్ కాబడిన మంచి మౌత్ టాక్ ను తెచ్చుకుంది. దీనితో ఈ చిత్రం అందుకున్న సక్సెస్ కు గాను మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ ను రెడీ చేస్తున్నారట. ఇంకా సమయం ఎపుడు అన్నది ఫిక్స్ కాలేదు కానీ ఈ ఇంట్రెస్టింగ్ చిత్రంపై ఈ వార్త అయితే కన్ఫర్మ్ అయ్యింది.

ఓ పక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఆ టెడ్డీ పై మంచి కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. మరి దానికి సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి డి ఇమాన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ వారే నిర్మాణం వహిస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అలాగే ఫస్ట్ పార్ట్ రివ్యూ కూడా కింద ఉన్న లింక్ లో ఉంది ఓ లుక్కేయండి.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :