అశోక్ గల్లా ‘హీరో’గా సెటిలయ్యేలానే ఉన్నాడు

Published on Jun 23, 2021 5:00 pm IST

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఇతని సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే సినిమా టీజర్ విడుదలైంది. మహేష్ బాబు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ పెట్టారు. టీజర్ కూడ బాగానే ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా లుక్స్ బాగున్నాయి. మొదటి సినిమా కాబట్టి నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.

నటుడిగానే కాకుండా యాక్షన్ హీరోగానూ పేరు తెచ్చుకోవాలనే తలన కూడ కనిపిస్తోంది. హీరో ఎలివేషన్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాత. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే అశోక్ గల్లా ఎంట్రీ బలంగానే ఉంటుందని, హీరోగా స్థిరపడగల ఫీచర్స్ అతనిలో ఉన్నాయని అర్థమవుతోంది. చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు టీమ్.

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :