ఎన్టీఆర్ బయోపిక్ గురించి స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్ !

Published on Dec 26, 2018 12:04 am IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ఇటీవలే ఆడియో & ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ బయోపిక్ గురించి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తన స్పందనను తెలియజేసారు. ఆ మహనీయుడు గురించి ఎన్నో అనుభూతులు కలగజేయడానికి సోదరుడు బాలయ్య ఆ తండ్రికి తగ్గ తనయుడుగా ఆ పాత్ర పోషించి నిర్మిస్తున్న బయోపిక్ విజయవంతం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

43 సంవత్సరాల క్రితం తన అమృత హస్తాలతో ప్రారంభించిన ఈ వైజయంతీ సంస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనుదిరిగి చూడకుండా పయనించింది. మా అన్నగారి చరిత్ర మళ్ళి కళ్ళకద్దినట్టు చూడటానికి చాలా ఎదురు చూస్తున్న, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’ అని అశ్విని దత్ తెలిపారు.

ఇక హిందీ, కన్నడ, తమిళ్ మరియు ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ ఎన్టీఆర్ బయోపిక్ డబ్బింగ్ కాబోతుందని బాలయ్య ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ లో వెల్లడించారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ను ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడం నందమూరి అభిమానులకు మంచి జోష్ ఇచ్చే అంశమే.

సంబంధిత సమాచారం :