
సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకున్న నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నారా రోహిత్ స్టైల్లో సాగే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాపై మొదట్నుంచే మంచి అంచనాలు ఉండడం, సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది.
కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్యామ్ ధేవభక్తుని నిర్మాత కాగా, నారా రోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సరికొత్త కథ, హీరో నారా రోహిత్, విలన్ రవివర్మల యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి. మొదటి వారాంతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. అన్నిచోట్ల నుండీ పాజిటివ్ టాక్ రావడంతో వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించే అవకాశముందని ట్రేడ్ టాక్!

