కడపలో `అశ్వ‌థ్థామ‌` సక్సెస్ టూర్ !

Published on Feb 3, 2020 11:13 pm IST

నాగ‌శౌర్య హీరోగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన `అశ్వ‌థ్థామ‌` సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. దాంతో చిత్రబృందం సక్సెస్ టూర్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ రోజు కడపకు `అశ్వ‌థ్థామ‌`టీమ్ సక్సెస్ టూర్ కి వెళ్ళింది. ఇక ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో మొత్తం రూ .7.05 కోట్లు వసూలు చేసింది.

పైగా తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తుండటంతో థియేటర్స్ ను పెంచారు. నాగ శౌర్య తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నూతన దర్శకుడు రమణ తేజ ఆసక్తికరమైన సస్పెన్స్ తో ఆకట్టుకొనేలా తెరకెక్కించారు. కాగా నాగ శౌర్య చేసిన యాక్షన్ సన్నివేశాలతో పాటు మాస్ పరఫార్మెన్సు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగ శౌర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఫిగర్ ఈ సినిమాకి రావడం విశేషం.

సంబంధిత సమాచారం :