మళ్ళీ “భీమ్లా నాయక్” బ్లాస్ట్ పై అందరి కళ్ళు.!

Published on Jan 1, 2022 3:00 pm IST

ఇప్పుడు శరవేగంగా జస్ట్ ఒక్క రోజులో పరిస్థితులు అన్నీ ఇండియన్ సినిమా దగ్గర మారిపోయాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉన్న పలు భారీ సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ కాగా ఇప్పుడు మళ్ళీ ఊహించని విధంగా కరోనా కలకలం రేపడం స్టార్ట్ చేసింది. ప్రతి రోజు కేసులు పెరుగుతూ మూడో వేవ్ కి ఇదే నాంది అన్నట్టు చేసాయి.

మరి ఇదిలా ఉండగా ఈ గట్టి పోటీలో ముందు నుంచి కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ నిలబడ్డ టాలీవుడ్ సినిమా “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మాస్ సినిమా ఇది. దీనిపై కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని హైప్ ఉంది. అయితే ఈ సినిమా కూడా పోటీలో ఉంటే నష్టాలు తప్పవని పలు కీలక మీటింగ్స్ అనంతరం ఎలానో బీమ్లా నాయక్ ని మిగతా సినిమాల నిర్మాతలు టాలీవుడ్ పెద్దలు మాట్లాడుకొని వెనక్కి పంపారు.

ఫైనల్ గా “భీమ్లా నాయక్” ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే సినిమాని దింపాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. మరి ఇప్పుడు ఇతర భారీ సినిమాలు వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపించడంతో అంతా ఇక భీమ్లా నాయక్ బ్లాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఏదైతే అది అయ్యింది ఈ సినిమాని మాత్రం దింపేయ్యండి అని అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమా ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. పవన్ కూడా ఇక్కడ లేడు మరి నిజంగానే భీమ్లా దిగుతాడో లేదో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :