ఇంత వరకు భరించారు…ఇక నావల్ల కాదు..!

Published on Jul 16, 2020 8:52 pm IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఆయన ఫ్యాన్స్ ని అత్యంత మానసిక క్షోభకు గురిచేసింది. దీనితో సుశాంత్ మానసిక వేదనకు, మరణానినికి కారణమైన వారంటూ బాలీవుడ్ లో కొందరు పెద్దలపై వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్, కరీనా కపూర్ వంటి వారిపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శించడం జరిగింది. కాగా సుశాంత్ ఫ్యాన్స్ హేటర్స్ లిస్ట్ లో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా ఉంది.

సుశాంత్ పై ఇటీవల ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఓ నెటిజెన్ ఏకంగా నీకు నువ్వుగా ఆత్మ హత్య చేసుకొని చనిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తాం అని, ఆమెను ఇంస్టాగ్రామ్లో బెదిరించారు. దీనికి రియా…ఇంత వరకు మీరు ఎన్ని మాటలు అన్నా భరించాను..ఇక నావల్ల కాదు. నన్ను ఆత్మ హత్య చేసుకో అనే హక్కు మీకు ఎవరిచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత సమాచారం :

More