రామ్ గోపాల్ వర్మ ‘అటాక్’ ట్రైలర్ రిలీజ్ డేట్!

రామ్ గోపాల్ వర్మ ‘అటాక్’ ట్రైలర్ రిలీజ్ డేట్!

Published on May 30, 2015 6:33 PM IST

Attack
ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో మనల్ని మెప్పించిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గత కొంతకాలంగా తన మార్క్ సినిమాను తీయలేకపోయారు. అయితే అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు వర్మ తన మార్క్ సినిమా తీస్తాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ తనకు బాగా అలవాటైన క్రైమ్ నేపథ్యంలో, సర్కార్ తరహా కథాంశంతో ‘అటాక్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే!

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం ‘అటాక్’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వర్మ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రేపు (మే 31) సాయంత్రం 6 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో వర్మ మళ్ళీ తన మార్క్ తీస్తాడా అన్నది వేచిచూడాలి.

అటాక్’ మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు