‘పంచతంత్రం’ వంటి రిచ్ కంటెంట్ ఉన్న సినిమాని తప్పకుండా ఆదరించాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్

‘పంచతంత్రం’ వంటి రిచ్ కంటెంట్ ఉన్న సినిమాని తప్పకుండా ఆదరించాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్

Published on Dec 8, 2022 12:11 AM IST


హర్ష పులిపాక దర్శకత్వంలో ఐదు కథల సమాహారంగా రూపొందిన లేటెస్ట్ మూవీ పంచతంత్రం. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక, సముద్రఖని, దివ్య శ్రీపాద, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని యువ నిర్మాతలు సృజన్, అఖిలేష్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాస్ కమర్షియల్ సినిమాల డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమాని చిన్న సినిమా అనవద్దని, ఇంత రిచ్ కంటెంట్ ఉన్న మూవీని ప్రతి ఒక్కరు మిస్ కాకుండా థియేటర్స్ లో చూడాలని కోరారు.

తాను టీజర్, ట్రైలర్ చూసినంతసేపు సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిందన్నారు. ఐదు కథలను అద్భుత సమాహారంగా కూర్చి అందరినీ ఆకట్టుకునేలా తీసిన దర్శకుడు హర్ష కి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు. ఇక సినిమా ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ బాగున్నాయని, ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని ఆదరిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఇటువంటి సినిమాలు వచ్చే అవకాశం ఉందన్నారు. హీరోయిన్స్ అంటే ఎక్కడో వేరే రాష్ట్రం నుండి వచ్చి కొద్దిగా తెలుగు మాట్లాడుతుంటారని, కానీ రాజశేఖర్ జీవితల కుమార్తె శివాత్మిక చక్కగా తన స్పీచ్ మొత్తం తెలుగులోనే మాట్లాడడం ఎంతో ఆనందంగా అనిపించిందని, ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే తనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలిపారు. ఇక సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేసిన హరీష్ శంకర్, నిన్న జరిగిన ఈ మూవీ ప్రివ్యూ మిస్ అయ్యానని, అయినప్పటికీ తప్పకుండా మూవీని థియేటర్ లో మాత్రం మిస్ కానని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు