ఇకపై నా సినిమా పోస్టర్ల మీద కలెక్షన్స్ ఉండవు – రామ్ చరణ్

Published on May 25, 2018 5:15 pm IST

ఈ మధ్య కాలంలో సినిమా విజయాన్ని అది సాధించే వసూళ్ల ఆధారంగా వెరీజు వేయడం సామప్రదాయంగా మారిపోయింది. ఏ సినిమా ఎక్కువ మొత్తం రాబడితే ఆ చిత్రం గొప్పదనే అభిప్రాయం అందరిలోకి వెళ్ళిపోయింది. దీని వలన అభిమానుల మధ్య అప్పుడప్పుడు కలహాలు కూడ చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైనే తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన చరణ్ ఈ నెంబర్స్ ట్రెండ్ తనకెందుకో హెల్తీ ఫీలింగ్ ఇవ్వడం లేదని అన్నారు.

నిర్మాతలు పోస్టర్లపై వాస్తవమైన కెల్క్షన్స్ నెంబర్స్ ఇచ్చినా ఆడియన్స్ దాన్ని అపార్థంగా తీసుకునే అవకాశం ఉందని, అందుకే ఆ అవకాశం కూడ ఉండకుండా భవిష్యత్తులో తన సినిమా పోస్టర్లపై వసూళ్ల నెంబర్స్ ఇవ్వకుండా తన నిర్మాతల్ని కోరుతానని, అందరం మంచి స్నేహితులమని, అభిమానులు కుడ స్నేహంగా ఉండాలని, హెల్తీ కాంపిటేషన్ నడుమ సినిమాలు చేసేలా ఉండాలనేది తన అభిప్రాయమని అన్నారు.

సంబంధిత సమాచారం :