అసురన్.. అడ్డాల.. అందరికీ ఆసక్తి

Published on Nov 17, 2019 9:00 pm IST

తమిళ చిత్రం ‘అసురన్’ తెలుగులో రీమేక్ కానుంది. వెంకీ ప్రధాన పాత్రధారి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారని తెలియగానే అందరికీ ఆశ్చర్యం, ఆసక్తి ఒకేసారి మొదలయ్యాయి. ఎందుకంటే అడ్డాల ఇమేజ్ వేరు, ‘అసురన్’ జోనర్ వేరు. అడ్డాల అంటే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం’ లాంటి క్లాస్, ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు చేసిన సాఫ్ట్ డైరెక్టర్. ఆయన మినిమమ్ యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లింది కూడా లేదు.

అలాంటి డైరెక్టర్ రివెంజ్ డ్రామా, హెవీ యాక్షన్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ ఉండే ‘అసురన్’ను ఏలా హ్యాండిల్ చేస్తారోనని తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ కథకు అడ్డాల ట్రీట్మెంట్ ఇస్తే ఎలాంటి ఔట్ పుట్ వస్తుందో చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకా హీరోయిన్, ఇతర ప్రధాన పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా జరుగుతుంది.

సంబంధిత సమాచారం :

More