అక్కడ “RRR” టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఊహించని ఇబ్బందులు?

Published on Jan 2, 2022 4:31 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఊహించని విధంగా మళ్ళీ చివరి నిమిషంలో వాయిదా పడాల్సి వచ్చింది.

దీనితో ఈ భారీ సినిమా నుంచి పెద్ద షాక్ నే అందరికీ తగిలింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు కానీ ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా రికార్డు ప్రీ సేల్స్ బుకింగ్స్ ని ఈ చిత్రం రాబట్టింది. దాదాపు 2 మిలియన్ డాలర్స్ కి మేర ఈ భారీ సినిమా బుకింగ్స్ తో అదరగొట్టేసింది.

మరి ఇప్పుడు సినిమా వాయిదా పడడంతో ఆ బుక్ చేసుకున్న అంతమంది పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరి డబ్బు వారికి తిరిగి పంపే ప్రాసెస్ ని సిద్ధం చేసి చాలా మందికే పంపడం స్టార్ట్ చేశారట.

అయితే ఈ ప్రాసెస్ లోనే డబ్బులు అయితే వెనక్కి వస్తున్నాయి కానీ కన్వీనెన్స్ మొత్తం మాత్రం తిరిగి రావడం లేదట. దీనితో టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఈ కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. దీనితో ఈ ఇష్యూ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :