కొత్త నారా రోహిత్ ను చూస్తారట !
Published on Nov 22, 2017 8:54 am IST

ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాల్ని ఎంచుకుంటూ, కొత్త దర్శకులతో పనిచేస్తూ కొత్తదనాన్ని విడువని హీరో నారా రోహిత్ ఈసారి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేసియాన్ చిత్రం ‘బాలకృష్ణుడు’. ఎన్నాళ్లగానో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాను చేయాలనుకుంటున్న రోహిత్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు.

బాగా వర్కవుట్స్ చేసి సుమారు 20 కిలోల వరకు బరువు తగ్గి సన్నబడి, పూర్తిస్థాయి కమర్షియల్ హీరో లుక్ కి వచ్చేశాడు. ఈ సినిమాతో ఇప్పటి వరకు చూడని కొత్త రోహిత్ ను చూస్తారని ఆయనే స్వయంగా హామీ ఇస్తున్నారు. మరి శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమాలో రోహిత్ ఎంత కొత్తగా కనబడతారో చూడాలి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్ర బాబు, వంశీ వినోద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా నూతన దర్శకుడు పవన్ మల్లెల దర్శకత్వం వహించారు.

 
Like us on Facebook