యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎలాంటి ఆడియో విడుదల వేడుక లేకుండానే.. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్లోకి విడుదల అవ్వనుంది. అయితే చిత్ర విడుదలకు ముందు, విడుదల కార్యక్రమం ఉంటుందని చిత్రబృందం తెలిపింది.
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలను అరవింద అందుకోగలడో లేడో చూడాలి.


