ఆస్ట్రేలియా జర్నలిస్ట్ మనసును హత్తుకున్న “జెర్సీ”.!

Published on Jun 26, 2021 4:00 pm IST

మన తెలుగు సినిమా హిస్టరీలో కొన్ని మాస్టర్ పీస్ సినిమాలు జాబితా తీస్తే వాటిలో నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” చిత్రం తప్పకుండ ఉంటుంది. అప్పుడు విడుదల అయ్యిన దగ్గర నుంచే ఎన్నో మన్ననలు జాతీయ స్థాయిలో అందుకుంది. ముఖ్యంగా నాని పెర్ఫామెన్స్ లైఫ్ టైం ఇచ్చేసారు.

అందుకే తెలుగు ఆడియెన్స్ సహా మూవీ లవర్స్ లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఇదే జెర్సీ చిత్రాన్ని చూసి ఆస్ట్రేలియా కి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బైలీ తన స్పందనను వ్యక్త పరచకుండా ఉండలేకపోయారు.

“జెర్సీ అనే ఒక సినిమా నేను చూసాను, అసలు ఏం ఎమోషనల్ జర్నీ అది.. మేకర్స్ బ్రిలియెంట్ జాబ్ అందించారు. నాని అయితే బ్యూటిఫుల్, అతనితో నువ్ నవ్వుతావు, ఏడుస్తావు. ఈ సినిమాలో ట్రైన్ సీన్ నా ఫేవరెట్” అని ఈ సినిమాపై తన అద్భుత స్పందనను తెలియజేసారు. దీనితో మరోసారి జెర్సీ చిత్రం పేరు మారుమోగుతోంది. అలాగే నాని అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :