‘యు/ఏ’ సొంతం చేసుకున్న ఆటోనగర్ సూర్య

‘యు/ఏ’ సొంతం చేసుకున్న ఆటోనగర్ సూర్య

Published on Jun 23, 2014 12:55 PM IST

auto-nagar-surya
నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరో నటించిన ‘ఆటోనగర్ సూర్య’ ఒక్కొక్కట్టిగా అన్ని ఇబ్బందులను తొలగించుకొని విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీం ఈ సినిమాని జూన్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కానీ గుంటూరులో ఓ బిజినెస్ మాన్ వేసిన కేసు వల్ల ఈ సినిమా రిలీజ్ ని జూలై 10వరకూ ఆపేయాలని కోర్టు ఆదేశాలను ఇవ్వడంతో విడుదల తేదీ కాస్త సంకటంలో పడింది. ఈ చిత్ర టీం ఆ సమస్యని క్లియర్ చేసి అనుకున్న తేదీకి సినిమాని రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

తాజా వార్తలు