మళ్ళీ చిక్కుల్లో పడ్డ ఆటోనగర్ సూర్య

auto-nagar-surya
నాగచైతన్య ఆటోనగర్ సూర్య ఇంకా సమస్యల నుంచి పూర్తిగా బయటపడనట్టుంది.ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్న తరువాత ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంపై గుంటూరు న్యాయస్థానం జూలై 10వ తేది వరకు స్టే విధించింది.మొహమ్మద్ అనబడే వ్యాపారి తనకు రావాల్సిన 2 కోట్ల రూపాయిలు ఇంకా తనకు అందలేదని నిర్మాతలపై కేసు వేసాడు.

దీనికి స్పందిస్తూ కోర్ట్ చిత్రం విడుదలను నిలిపివేసింది.కాబట్టి ఈ చిత్రాన్ని గుంటూరు మినహా మిగతాచోట్ల విడుదల చేస్తారా లేదా పైకోర్టుకి వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై మరింత సమాచారం కోసం ఈ స్పేస్ ను ఫాలో అవ్వండి.

Exit mobile version