అన్ని సెంటర్ల నుంచి వచ్చిన ప్రేక్షకుల స్పందనని తెలుసుకున్న తరువాత ‘ఆటోనగర్ సూర్య’ నిడివిని 12 నిమిషాలు తగ్గించనున్నారు. సెకండ్ హాఫ్ లో అవసరంలేని కొన్ని సన్నివేశాలని చిత్రం పేస్ పెంచడానికి తీసేశారు.
ఈరోజు విడుదల అయిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది మాత్రం ఈ చిత్రం లోని డైలాగ్స్ ని యాక్షన్ సన్నివేసాలని మెచ్చుకుంటున్నారు. చైతన్య డైలాగ్ డెలివరీ చాలా మెరుగుపడిందని సమాచారం.
దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మించింది.


