‘ధురంధర్’ తెలుగు వెర్షన్ కి ఆ భారీ సినిమా టెన్షన్?

‘ధురంధర్’ తెలుగు వెర్షన్ కి ఆ భారీ సినిమా టెన్షన్?

Published on Dec 16, 2025 6:00 PM IST

Dhurandhar-2

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని షేక్ చేస్తున్న మరో సెన్సేషనల్ హిట్ చిత్రమే “ధురంధర్”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అక్షయే ఖన్నా ఇంకా తదితర స్టార్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. అయితే ఆల్రెడీ హిందీలో చితక్కొడుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కి కూడా మంచి డిమాండ్ సొంతం చేసుకుంది.

ఇలా తెలుగులో కూడా త్వరలోనే రిలీజ్ ఉంటుంది అనే టాక్ ఉంది కానీ ఈ డిసెంబర్ 19నే తెలుగులో ఉండొచ్చనే టాక్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎంత హైప్ ఉన్నా కూడా అదే డేట్ లో అవైటెడ్ హాలీవుడ్ చిత్రం అవతార్ 3 కూడా ఉంది. దీని కోసం కూడా తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పొరపాటున ఈ సినిమాకి కూడా టాక్ పడినా మంచి రన్ ఖాయం సో ఈ పోటీలో ధురంధర్ తెలుగు వెర్షన్ కి ఏమవుతుంది అనేది కొంచెం టెన్షన్ గా మారింది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు