“అవతార్”కు ఎండ్ కార్డ్ వేసేలా ఉన్న “ఎండ్ గేమ్”

“అవతార్”కు ఎండ్ కార్డ్ వేసేలా ఉన్న “ఎండ్ గేమ్”

Published on Jun 3, 2019 11:14 PM IST

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల ప్రస్తావన వచ్చింది అంటే అందులో ఠక్కున “జేమ్స్ కెమరూన్” తెరకెక్కించిన అద్భుత చిత్రం “అవతార్” గుర్తుకు వస్తుంది.2009లో విడుదలైన ఈ చిత్రం నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కాదు.అలాగే ఇదే దర్శకుడు తెరకెక్కించిన “టైటానిక్” అయితే అవతార్ రాక ముందు వరకు నెంబర్ 1 స్థానంలో ఉండగా ఆ సినిమా తర్వాత 2వ స్థానానికి పడింది.ఇవన్నీ పక్కన పెడితే గత రెండు దశాబ్దాలలో ఎన్నో భారీ హాలీవుడ్ చిత్రాలు విడుదలైనా సరే అవతార్ కాదు కదా టైటానిక్ దగ్గరకు కూడా వెళ్లలేకపోయాయి.

కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ రెండు చిత్రాలకు చెక్ చెప్పేందుకు రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన “అవెంజర్స్ ఎండ్ గేమ్” సిద్ధమయ్యింది.మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ఎలాగో అవెంజర్స్ సిరీస్ నుంచి ఆఖరు సినిమా కావడంతో అవతార్ రికార్డులు బద్దలు కొడుతుందా లేదా అన్న ఒక అనుమానం ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది.ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అవతార్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ లేకపోలేదు అని చెప్పాలి.
ఎందుకంటే కేవలం ఈ రెండు చిత్రాలకు మధ్య 75 మిలియన్ డాలర్ల తేడా మాత్రమే ఉంది.ఎందుకంటే అవతార్ చిత్రానికి ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 2.787 బిలియన్ డాలర్లు కొల్లగొట్టగా ఎండ్ గేమ్ మాత్రం ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే 2.713 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.అంటే ఇంకో 75 మిలియన్ డాలర్లు వస్తే ఎండ్ గేమ్ అవతార్ కు ఎండ్ కార్డు వేసేసినట్టే అని చెప్పాలి.ఒకవేళ ఎండ్ గేమ్ కానీ అవతార్ రికార్డులను బద్దలు కొడితే వాటిని మళ్ళీ “అవతార్ 2” సునాయాసంగా అధిగమించేస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు