అవెంజర్స్ ఎండ్ గేమ్ రెండవ రోజు మరో 50కోట్లు .. !

Published on Apr 28, 2019 6:15 pm IST

హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో కొత్త రికార్డులను నెలకొల్పుతుంది. మొన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కల్లెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇండియాలో అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు 53.10కోట్ల షేర్ ను రాబట్టగా రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగించి 51 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.దాంతో ఇండియాలో అతి తక్కువ సమయంలో రెండు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హాలీవుడ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఈ చిత్రం మొదటి వారాంతంలోనే ఈ చిత్రం 150కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇక అలాగే ఫుల్ రన్ లో ఈచిత్రం ఇండియా లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి హాలీవుడ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనుంది.

సంబంధిత సమాచారం :